మన రైతుకుటుంబం మొదటి మీటింగ్ విషయాలు

June 4th , 2017 – మన రైతుకుటుంబం మొదటి మీటింగ్ విషయాలు
చర్చించిన విషయాలు :
1. రైతులకి భూసార పరీక్షలపై అవగాన కల్పించుటకు ముందుగా కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ క్రింద ప్రత్యేక సమావేశాలు జరిపి రైతులకి శాస్త్ర విజ్ఞానాన్ని అందించటం అలాగే ఈ విషయంలో ప్రభుత్వ సహాయాన్ని ,సమన్వయాన్ని కోరటం .


రావు మైలవరపు గారి సూచనలు , అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భుసార పరీక్షలకి కావలసిన వాటిని ఏర్పాటు పరిశీలన.పాచ్చాత్య దేశాల్లో మాదిరిగా కస్టమ్ కిట్స్ ఇవ్వగలమా అనే అంశాన్ని పరిశీలన చేసి NRI ల సహకారంతో పని చేయటం .
2. విత్తనాల శుద్దిపై సమగ్ర అవగాన కలిపించటం
3. నిర్దేశించిన గ్రామాల్లో ఔత్సాహిక రైతులతో కలిసి పంటకాలంలో విశ్రాంత మరియు ఆ ప్రాంత వ్యవసాయ అధికారులతో కలిసి పంటలపై అవగాహన కలిపిస్తూ , పెట్టుబడులని తగ్గించే ప్రక్రియ .
తన పంటకి ఏ తెగులో వచ్చిందో తెలిస్తే రైతుకు ఏ మందు వాడాలో తెలియ చెప్పటం .దానివలన అనవసరంగా సంబందంలేని పురుగుమందులు కొట్టి పెట్టుబడి భారం లేకుండా చూడటం .
4.ప్రకృతి వ్యవసాయంపై అవగాహన మరియు ఆధునిక పద్దతులని తెలియజెప్పటం .
5. i4farmers , మన రైతుకుటుంబం కలిసి రైతులకోసం పనిచేయటం .
ఈ సమావేశంలో Dr. N .V క్రిష్ణయ్య గారు ( వ్యవసాయ శాస్త్రవేత్త , వరి పై ఎన్నో అధ్యయనాలు చేసి ,సూచనలు చేయటమే కాకుండా Rice Brown Planthopper అనే పుస్తకం వ్రాసారు , ప్రస్తుతం అది ప్రింటింగ్ దశలో ఉన్నది ) పాల్గొన్నారు .
Dr. N .V క్రిష్ణయ్య గారు పెద్ద మనసుతో ఒక సూచన చేసారు . తను ఇండియా వెళ్ళినాక మనం పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఎన్నుకున్న గ్రామాల్లో పంట కాలంలో రైతు పొలాలని సందర్శించి తగు సూచనలు చేస్తాం అని చెప్పారు , అలాగే తన సహాచర శాస్త్రవేత్తలతో కూడా ఒక బృందంగా ఏర్పడి మన రైతుకుటుంబం ఆధ్వర్యములో Farming Awareness prograams కి రూపకల్పన .
6. రైతులకి పంట గిట్టుబాటు ధరలకి మద్దతు తెలుపుతూ జులై నెలలో Walk ఫర్ Farmers ఇన్ న్యూ జెర్సీ .

మన రైతుకుటుంబం ఆద్వర్యంలో ప్రతి ప్రోగ్రాం – రాజకీయ సంబంధంలేనివి . ఇది పూర్తిక రైతుల క్షేమంకోసం … రైతు కుటుంబాల నుండి వచ్చిన సభ్యులతో శాస్త్రవేత్తలతో మరియు రైతు సంక్షేమం కోరే మిత్రులతో ఏర్పడిన సంస్థ .
ఎవరైనా ఈ నోబల్ cause లో బాగస్వామ్యం అవ్వొచ్చు .
అతి తక్కువ సమయం అయినాకూడా సమావేశానికి వచ్చి తమ అమూల్యమైన సలహాలను , మద్దతును తెలిపిన మిత్రులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదములు .

సమావేశాలో పాల్గొన్న సభ్యులు :
శ్రీ . Dr. N .V క్రిష్ణయ్య ( వ్యవసాయ శాస్త్రవేత్త )
శ్రీ . తుళ్ళూరు కోటయ్య
శ్రీ . భీమినేని శ్రీనివాసరావు
శ్రీ .రవి పెందుర్తి
శ్రీ . శశిధర్ యాదాలం ( పౌల్ట్రీ సైంటిస్ట్ )
శ్రీ . చంద్ర కరింగుల
శ్రీ .నవీన్ తన్నీరు
శ్రీ . కృష్ణ చైతన్య
శ్రీ . Y .R .N టాగూర్
శ్రీ .ప్రసాద్ ఎర్నేని
శ్రీ .శ్రీధర్ గుడాల
శ్రీ .అనిల్ నాగండ్ల
శ్రీ .వేణుగోపాల్ సంకినేని
శ్రీ . శ్రవంత్ పోరెడ్డి
శ్రీ .శ్రీకర్ లింగరాజు
శ్రీ .ఉప్పుటూరి అప్పయ్య
శ్రీ .ఉప్పుటూరి వీరు
శ్రీ . సురేష్ ఈడిగ (i4farmers)
శ్రీ . నవీన్ తొండపు
శ్రీ . శ్రీకర్ లింగరాజు
శ్రీ . గోపి పులబాల
శ్రీ . పోల్కంపల్లి రామానంద్
శ్రీ . తుళ్ళూరు నరేష్ , శ్రీ . కార్తీక్
శ్రీ . శ్రీనివాస్ కళ్యాణపు

మన వ్యవసాయ కుటుంబాలకోసం,రైతు సంక్షేమం కోసం … ప్రతి రైతు పిల్లలని కలిసి ముందుకురమ్మని ప్రార్ధిస్తున్నాము .
మన రైతుకుటుంబం చేపట్టే పైలట్ ప్రాజెక్ట్ ఎవరైనా NRI లు మీ గ్రామాల్లో నిర్వహించదలుచుకుంటే తెలియజేయగలరు .
మన గ్రూప్ లో ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి వారి సమయానుకూలంగా తదుపరి కార్యక్రమం తెలియజేస్తాం .
— శ్రీనివాస్ కళ్యాణపు. మన రైతుకుటుంబం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s